Rain Alert: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 2 గేట్లను ఎత్తి 18,633 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
ప్రధాన జలాశయాల్లో ఒకటైన సింగూరు ప్రాజెక్టుకి వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, జలాశయంలో నీటి మట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు గేట్లను ఎత్తే నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజు (ఆగస్టు 27) ఉదయం 10 గంటల సమయంలో, ప్రాజెక్టు అధికారులు 9వ మరియు 11వ గేట్లను ఎత్తి, సుమారు 18,633 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి 24,541 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందని ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో, భద్రతా చర్యలలో భాగంగా ఈ నీటి విడుదల చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కొనసాగుతున్నందున, ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also:
తెలంగాణలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, అర్హత, ప్రయోజనాలు, స్టేటస్ చెక్
విద్యలో ప్రతిభావంతులై ఆర్థికంగా వెనుకబడినా విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వ స్కాలర్షిప్ వివరాలు
ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సింగపూర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నదీ తీర ప్రాంత వాసులు మది తీరానికి దూరంగా ఉండాలనీ జలవనరుల శాఖ విజ్ఞప్తి చేస్తోంది.