Power Grid Corporation of India Limited (POWERGRID) ఉద్యోగావకాశాలు – Officer Trainee పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | POWERGRID Officer Trainee Recruitment 2025
భారత ప్రభుత్వ ఆధీనంలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) తాజాగా ఖాళీలుగా ఉన్న 20 Officer Trainee (Finance) పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ సంస్థలో ఉద్యోగం ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 5 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Officer Trainee ఉద్యోగ వివరాలు
| విభాగం | వివరాలు |
| సంస్థ పేరు | Power Grid Corporation of India Limited (POWERGRID) |
| పోస్టు పేరు | Officer Trainee (Finance) |
| మొత్తం ఖాళీలు | 20 పోస్టులు |
| ఉద్యోగ స్థలం | భారత్‌లో ఎక్కడైనా |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.powergrid.in |
POWERGRID Officer Trainee Recruitment 2025 Vacancy వివరాలు
| పోస్టు పేరు | మొత్తం ఖాళీలు | కేటగిరీ ఆధారంగా ఖాళీలు |
| Officer Trainee (Finance) | 20 పోస్టులు | UR – 10, OBC – 5, SC – 3, ST – 1, EWS – 1 |
అర్హత వివరాలు
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ (Accounts & Financial Management) విభాగానికి సంబంధించినా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి:
- CA (Chartered Accountant) లేదా ICWA (Cost Accountant) ఉత్తీర్ణత తప్పనిసరి.
- అభ్యర్థులు సంబంధిత రంగంలో గట్టి అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
వయోపరిమితి విషయానికి వస్తే, సాధారణ వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్టంగా 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అయితే, SC, ST, OBC మరియు దివ్యాంగుల వర్గానికి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం వయోపరిమితిలో తగిన సడలింపు ఇవ్వబడుతుంది. ఈ సడలింపు సంవత్సరాల పరంగా వర్గానుసారం మారుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన వయోపరిమితి వివరాలను పరిశీలించి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు
| వర్గం | ఫీజు |
| సాధారణ/ఓబీసీ | రూ.500 |
| ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు | ఫీజు మినహాయింపు |
ఎంపిక విధానం
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) తాజా Officer Trainee (Finance) పోస్టులకు అభ్యర్థులను అధికారులు రెండు దశల్లో ఎంపిక చేస్తారు:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)
- ఇంటర్వ్యూ
ఈ రెండు దశల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను Officer Trainee పోస్టులకు నియమిస్తారు.
జీతం & శిక్షణ
Officer Trainee పోస్టుకు ఎంపికైన వారికి మొదట శిక్షణ కాలంలో ఆకర్షణీయమైన స్టైపెండ్ ఇవ్వబడుతుంది. శిక్షణ అనంతరం పూర్తి సమయ ఉద్యోగిగా నియమితులయ్యే అవకాశం ఉంటుంది. జీతం పవర్‌గ్రిడ్ నిబంధనల ప్రకారం ఉంటుంది, ఇది సుమారు రూ. 50,000 – రూ. 1,60,000 మధ్యగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
Officer Trainee పోస్టులపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 2025 నుండి చివరిగా నవంబర్ 5, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు
| కార్యక్రమం | తేదీ |
| నోటిఫికేషన్ విడుదల | అక్టోబర్ 2025 |
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | అక్టోబర్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 5, 2025 |
దరఖాస్తు ప్రక్రియ (Powergrid Officer Trainee Apply Online)
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) ద్వారా Officer Trainee పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఇవ్వబడిన దశల ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్‌సైట్ https://www.powergrid.inని సందర్శించండి.
- “Careers → Job Opportunities → Openings” విభాగంలో Officer Trainee (Finance) లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలు సరిగ్గా నమోదు చేయండి.
- అవసరమైన పత్రాలు (సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం) అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించండి.
- ఫారమ్ సమర్పించి, దాని ప్రింట్ కాపీని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచుకోండి.
సూచనలు
- ఫారమ్ నింపేటప్పుడు ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయండి.
- ఫీజు చెల్లింపులో ఏదైనా సమస్య ఎదురైతే, వెబ్‌సైట్‌లో ఇచ్చిన హెల్ప్‌డెస్క్ ఇమెయిల్ లేదా కాంటాక్ట్ నంబర్ ద్వారా సంప్రదించండి.
- చివరి తేదీకి ముందు దరఖాస్తు పూర్తి చేయడం తప్పనిసరి.
పవర్‌గ్రిడ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది బంగారు అవకాశం. మీరు CA లేదా ICWA పూర్తి చేసినవారైతే, ఈ ఉద్యోగం మీ భవిష్యత్తుకు దారితీసే అద్భుతమైన చాన్స్. నవంబర్ 5 లోపు దరఖాస్తు చేయడం మర్చిపోవద్దు!
ఇవి కూడా చదవండి:
✔️ తెలుగు బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు – జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
✔️ కొడుకు నిర్లక్ష్యం తో ఆవేదన చెందిన మాజీ ఎంపీపీ – రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం
Important Links
| Official Website | Click Here |
| Notification PDF | Click Here |
| Apply Online | Click Here |
Powergrid Officer Trainee Jobs FAQs
POWERGRID Officer Trainee పోస్టులకు ఏ అర్హత అవసరం?
CA లేదా ICWA ఉత్తీర్ణత తప్పనిసరి.
చివరి తేదీ ఎప్పుడు?
నవంబర్ 5, 2025 చివరి తేదీ.
దరఖాస్తు ఫీజు ఎంత?
సాధారణ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు మినహాయింపు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
రాత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
అధికారిక వెబ్‌సైట్ ఏది?
https://www.powergrid.in








