Latest News Ticker — Single Line

కొడుకు నిర్లక్ష్యం తో ఆవేదన చెందిన మాజీ ఎంపీపీ – రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం

By Madhu Goud

Published On:

Follow Us

హన్మకొండ, అక్టోబర్ 15: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. ఒక తండ్రిగా, ఒక భర్తగా అనుభవించిన బాధను ఆయన మళ్లీ మరిచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.3 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి దానం చేస్తూ, కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. తన భార్య జ్ఞాపకార్థం ప్రభుత్వం ఒక భవనం నిర్మిస్తే సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూసే వారికి ఇది గుణపాఠంగా మారాలి

కుటుంబం నుండే గెంటేశారు

శ్యామ్ సుందర్ రెడ్డి గతంలో (2006–2011) ఎల్కతుర్తి మండల ఎంపీపీగా పనిచేశారు. సామాజిక సేవకు కట్టుబడి, ప్రజల మేలు కోసం పనిచేసిన ఆయన తన ఆఖరి రోజులు ప్రశాంతంగా గడిపేందుకు ఆశించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు.
తన కుమారుడు రంజిత్ రెడ్డి తనపై చేతులు వేసి ఇంటి నుండి బయటకు తన్నేశాడని, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను, ఇంటినీ సైతం స్వాధీనం చేసుకున్నాడని శ్యామ్ సుందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తన కూతురికి కట్నంగా ఇచ్చిన భూమిని కూడా అక్రమంగా పట్టించుకున్నాడని ఆరోపించారు.

ప్రభుత్వమే పరిరక్షణగా…

ఈ తరుణంలో, తన వద్ద మిగిలిన 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలు ప్రభుత్వానికి దానం చేయాలని నిర్ణయించుకున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌కు ఈ విషయాన్ని వివరంగా తెలియజేశారు. తన భార్య వసంత జ్ఞాపకార్ధం ఆ భూమిలో ఒక భవనం నిర్మించాలని కోరారు. “ఆ భవనం ప్రభుత్వ వినియోగానికి వస్తే ఆనందంగా ఉంటుంది. నా భార్య పేరు చిరస్మరణీయంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.

తల్లిదండ్రులను నిర్లక్షించే వారికి గుణపాఠం కావాలి

శ్యామ్ సుందర్ రెడ్డి చెప్పినట్లుగా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్షించే వారిని సమాజం చూస్తూ ఊరకూడదని, వారికి గుణపాఠంగా ఉండేలా చట్టాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఇతరులకు, ముఖ్యంగా యువతకు ఒక సందేశంగా నిలవాలన్నారు.

కలెక్టర్ స్పందన

ఈ ఘటనపై హన్మకొండ కలెక్టర్ స్పందించినట్టు సమాచారం. శ్యామ్ సుందర్ రెడ్డి నిర్ణయాన్ని ప్రభుత్వ స్థాయిలో పరిశీలించి, భవన నిర్మాణానికి అవకాశం ఇవ్వడం పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ సంఘటన మరోసారి మనకు గుర్తు చేస్తోంది – ఆస్తులు, ఆదాయాల కంటే కుటుంబ బంధాలే ముఖ్యమని. ఒక తండ్రి, తన కుమారుడి చేతిలో ఎదుర్కొన్న అవమానం వల్ల, చివరికి తన సంపదను సమాజానికి అంకితం చేశాడు. ఇది ప్రతి ఒక్కరికీ ఆలోచించాల్సిన విషయం.

You Might Also Like

Leave a Comment