దేశవ్యాప్తంగా విద్యలో ప్రతిభావంతులై ఆర్థికంగా వెనుకబడినా విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించడానికి ప్రతి సంవత్సరం వివిధ స్కాలర్షిప్ లను అందిస్తుంది. అందులో 2025-26 సంవత్సరానికి గాను విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్న వాటిలో ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMSS Scholarship 2025-26) కూడా అలాంటి అవకాశాల్లో ఒకటి. ఈ. NMMSS స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో సహాయం పొందవచ్చు.
ఈ స్కాలర్షిప్ ముఖ్యంగా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకునే చివరి తేది ఆగస్టు 31, 2025. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ తేదికు ముందే దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు
ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NMMSS స్కాలర్షిప్ ను పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి వాటిలో ముఖ్యమైనవి:
✔ ఏడో తరగతిలో కనీసం 55% మార్కులు సాధించాలి.
✔ విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹3.50 లక్షలకు మించరాదు.
✔ విద్యార్థి ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్నవారు కావాలి.
✔ కేంద్ర విద్యాలయాలు, నవోదయ, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం అనర్హులు.
దరఖాస్తు మరియు ఫీజు
NMMSS స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarships.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ దరఖాస్తు ఫీజు ₹100, అయితే ఎస్.సీ., ఎస్.టి. మరియు PHC విద్యార్థులకు ₹50 మాత్రమే. ఈ ఫీజు ఎస్టీ ఐ చలానా ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసిన విద్యార్థులను ఎంపిక చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక మెంటల్ అబిలిటీ టెస్ట్ మరియు స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలలో విజేతలైన విద్యార్థులకు నెలకు ₹1,000 చొప్పున స్కాలర్షిప్ అందించబడుతుంది.
NMMSS Scholarship 2025-26 స్కాలర్షిప్
ఎంపికైన విద్యార్థులు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ పొందవచ్చు. అంటే, నెలకు ₹1,000 చొప్పున, మొత్తం నాలుగు సంవత్సరాల పాటు విద్యార్ధుల విద్యాభ్యాసానికి నిధులు అందిస్తారు.
మొత్తం లక్షమందికి ఈ స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఇది కేవలం ఒక చిన్న మొత్తమే అయినా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు విద్య కొనసాగించడంలో చాలా ఉపయోగపడుతుంది.
Also Read
రోజుకు ₹340 పొదుపుతో ₹7 లక్షలు పొందండి – పోస్ట్ ఆఫీస్ RD స్కీం
నెలకు ₹10,000 పెట్టుబడి చేసి ఐదేళ్లలో ₹7 లక్షలు పొదుపు
తెలంగాణలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, అర్హత, ప్రయోజనాలు, స్టేటస్ చెక్
స్కాలర్షిప్ వల్ల లభించే ప్రయోజనాలు:
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ విద్యార్థులకు అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. మొదటగా ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMSS) ద్వారా ఆర్థిక సహాయం అందడం ఇది విద్యార్థుల చదువుల ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఈ స్కాలర్షిప్ పొందడం ద్వారా ప్రతిభావంతులు విద్యార్థులు మరింత ఉత్సాహంగా మరియు ధ్యాసతో చదువుకునే ప్రేరణను పొందుతారు. అంతేకాక, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కూడా ప్రతిభ చూపే సమాన అవకాశాన్ని పొందడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు.
చివరి మాట
విద్యార్థులు విద్యలో ఎంత ప్రతిభావంతంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉండడం ద్వారా విద్యార్థుల తమ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ముగించాల్సి వస్తుంది. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం మిస్ కాలర్ షిప్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ స్కీం ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇది మంచి అవకాశం. కనుక eligible ఉన్న విద్యార్థులు ఈ అవకాశం మిస్ అవకుండా ఉండడానికి తక్షణమే దరఖాస్తు చేసుకోవాలి.
మరింత సమాచారం కోసం: scholarships.gov.in