Freedom Plan: కేవలం రూ.1తో నెలరోజుల పాటు ఉచిత డేటా, కాల్స్.. వివరాలు ఇవే!

By Madhu Goud

Published On:

Follow Us
BSNL introduces rs1 freedom plan with 1 Month Validity

కేవలం రూ.1తో నెలరోజుల పాటు ఉచిత డేటా, కాల్స్.. వివరాలు ఇవే! | BSNL introduces rs1 freedom plan with 1 Month Validity

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ తో ముందుకు వచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెలరోజుల పాటు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ ను ప్రకటించింది. ఆగస్టు 15 సందర్భంగా ‘ఆజాదీ కా ప్లాన్’ పేరుతో ఈ ఆఫర్ ను పరిచయం చేసింది. ఈ బీఎస్ఎన్ఎల్ ఆజాదీ ప్లాన్ లో ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు, ఏ నెట్వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్ ఆగస్టు 1 అంటే శుక్రవారం నుంచి ఈ నెలాఖరు (31వ తేదీ) వరకు అందుబాటులో ఉంటుంది.

ఆఫర్ ఎవరికంటే?

ఈ ఆఫర్ తోపాటు సదరు కంపెనీ కొత్త సిమ్ కార్డు కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. పాత వినియోగదారులకు మాత్రం ఈ ప్లాన్ అందుబాటులో లేదు.

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ఎందుకంటే?

ఇటీవలి కాలంలో ఇతర నెట్వర్క్ సంస్థలు టెలికాం ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకి చెందిన యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ కు మారిపోయారు. దీంతో దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ భారీగా సబ్ స్క్రిప్షన్లను కోల్పోయాయి. ఇప్పుడు బ్రహ్మాండమైన బీఎస్ఎన్ఎల్ ఆజాదీ ప్లాన్ తో బీఎస్ఎన్ఎల్ ముందుకు రావడం.. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ లకు మరింత ఇబ్బందికరంగా మారనుంది. దీంతో ఎక్కువ మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ కు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
BSNL introduces rs1 freedom plan with 1 Month Validity ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం- ఈ కార్డు చూపించాల్సిందే
BSNL introduces rs1 freedom plan with 1 Month Validity APలో QR కోడ్‌తో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – మీ పేరు ఉందా చెక్ చేసుకోండి!
BSNL introduces rs1 freedom plan with 1 Month Validity వాహనదారులకు బిగ్ షాక్: ‘నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌’.. ఎల్లుండి నుంచే అమల్లోకి!

**Tags: ** BSNL, BSNL Azadi Plan, BSNL New Offer, BSNL 1 Rupee Plan, BSNL Offers, Jio, Airtel, Telecom plans, Mobile Recharge Plans, 2GB Data Plan, Unlimited Calling, BSNL SIM Card

Leave a Comment